Tumrees 8

ప్రేమ దొరకటమే
చాల కష్టం
జారవిడుచుకుంటే
చాల నష్టం
తర్వాత ఎంత
మదనపడినా
ఫలితం శూన్యం
మనం ప్రేమించే వ్యక్తి
దొరకేకంటే
మనల్ని ప్రేమించే వ్యక్తి
దొరకటంలో ఎంతో ఆనందం!

Tumrees 7

మౌనం
ఆరోగ్యానికి మంచిది కాదని.
అది మనసును
ఇంకా వ్యధల్లోకి నెట్టివేస్తుందని తెలుసుకో
స్నేహాన్ని వదులుకుంటే
ఆ బాధ తీర్చాలంటే
ఎవరి తరం కాదు.

Tumrees 4

kapila raamkumar Tumrees 4

మనసులోనే

మదనపడకు

మనసున్న వారితో

అరమరికలేక

మనసు విప్పుకో!
తేలిక పడుతుంది
దిగులు
పారిపోతుంది
స్వాంత్వన కలిగి
మది తేలిక పడుతుంది!
లోలోపలే ఆణచి వేస్తే
సరిచేయలేని
కణితౌవుతంది
మనసును కృంగతీస్తుంది

కపిల రాంకుమార్ || లే – కదులు ఆవాజ్ దో! ||

కపిల రాంకుమార్ || లే – కదులు ఆవాజ్ దో! ||
పాటు పడేవాడికి
సాపాటులేదు!
పోటు పొడిచే వారందరికి
కూటికి కొదువలేదు!
కష్టం చేసి దాచుకున్నా
కన్నం వేసి దోచుకునే వాళ్ళే ఎక్కువ
ప్రతీ అర – క్షణం
అరక్షణంగా
బతుకీడ్చేలోకంలో
నీతి నిజాయితి ఒట్టి కాకమ్మ కబుర్లే
గోడల మీద రాతలే కాని
మెదడులోకి మాత్రం దూరవ్
అడగాలంటే భయం
అడుగు వేయాలంటే భయం
అడుగుకి పడిపోతున్నామంటే లేదు
అభయహస్తం!
సామెతలు ఎన్నో వున్నా
అవి ఇవాళ ఔట్ డేటెడ్
ఉపయోగించావా
ఎట్రాసిటీ కేసు
నీ మెడకు చుట్టుకున్నట్టే
సుద్దులు చెప్పలేవు,
బుద్ధులు చెప్పలేవు
పెద్దల మాట వెనకటికి చద్దిమూటే కాని
నేడు కుదరదు
నీ మాటవినే వాడెవ్వడూ లేడు!
వద్దన్న పనే చేస్తారు
బోర్ల పడ్డా,
దెబ్బలు తిన్నా
ఆ ఊబిలోంచి బయటకు రారు
మళ్ళీ అవే పొరపాట్లు
చేస్తూనేవుంటారు
సంఘటనలకు
ఏదో మొక్కుబడికి స్పందించినా
పునరావృమవుతున్నా
పట్టించుకోని సర్కారులాగ మౌనం వహిస్తూ
నేరాన్ని ప్రోత్సహిస్తారే కాని
జాగు చేస్తూనేవున్నారే కాని
నివారించడానికి కదుల్తలేరు
నేత బాగాలేదు సరే,
నేతన్నల బతుకే బాగాలేదని తెలుసా!
నేతలకు పట్టడంలేదేమని అడిగావా!
జరుగుతున్న అన్యాయాలెన్నో,
అకృత్యాలెన్నో
అరాచకాలెన్నో
మౌన ప్రేక్షకుడిలా
ఎన్నాళ్ళుంటావ్
కుళ్ళు కంపు కొడుతున్నా
కళ్ళప్పగించి చూస్తావేగాని
పూచికముల్లు స్పర్శకూడ తెలియని
మంద చర్మమా నీది!
మూగ నోము వీడు
జనం ఘోష చూడు
మనిషీ మేలుకో
తిరిగబడే గొతులతో
పిడికిళ్ళతో
సామూహిక యాత్రలో
కదం కదుపు
లేక పోతే చరిత్ర హీనుడవే
యదార్థ వాది లోక విరోధి అన్నారని
సత్యాన్ని వెలుగులోకి రాకుండా చేస్తావా!
లే!…కదులు!
ఆవాజ్ దో!
24.1.2017
(విమల సాహితి సమితి – త్యాగరాయ గానసభ హైదరబాద్‌ – కవిసమ్మేళనంలో చదివినది)

కపిల రాంకుమార్‌ || టుమ్రీలు 4 -జనవరి ||

కపిల రాంకుమార్‌ || టుమ్రీలు  4 -జనవరి ||
నీ ‘ అడుగు ‘
అట్టడుగెందుకయ్యిందని
అడుగు!
**
విసుగు చూపటం కాదు
కసిగా గురిచూసి
మసిచేయటమే లక్ష్యం కావాలి
**
నిజాలు తెలిసినా
అహాలు వీడని బతుకెందుకు
నిజం నిప్పైనపుడు
మోహాల్ని కాల్చదెందుకు !
**
దుందుడుకు కాదు
దుముకే అడుగులో స్పష్టతుండాలి
కనిపించేది శత్రువు కాదు
అందలంలో దాక్కుంది చూడు!
**
శకునం చూసే కదిలాడు
పిచ్చిది దానికేం తెలుసు
పిక్కపట్టింది
తిక్క కుదిరింది!
**
అలవాటు పడ్డవాళ్ళు,
అలవోకగానే పెడ్డలేస్తారు
బులపాటం తీరగానే
అలకలు పూనుతారు!

జనవరి 10, 2017 ఉదయం 10.23