|| గేయం – పాట || విషయ సేకరణ||

కపిల రాంకుమార్|| గేయం – పాట ||
”వృత్తం, గేయం, వచన గేయం, – చందస్సుల పరిణమ క్రమమని, యే భాషలోనైనా
అక్షర గణ వృత్తాలకంటే ముందుగా మాత్రా చందస్సే పుడుతుందని, యే కవిత్వానిలైనా
పురుడుపోసుకునేది పాటతోనేనని, పాట, గేయం ఒకటేనని నా అభిప్రాయమని, గాన యోగ్యమైనదే గేయం ” అని సి.నారాయణరెడ్డి అంటారు.

” చందో వ్యవస్థను దాదాపు రెండు భాగాలుగా విభజించి పరిశిలిస్తే, ఒకటి పద్య భాగంగా,
మరొకటి గేయ భాగంగా నిర్థారించాలి. పద్య భాగం ‘ అక్షర ‘ చందస్సుతోను రెండవ భాగం
‘ మాత్రా ‘ చందస్సు తోనూ గుర్తించాలి. పద్యంలో జాతులు, వృత్తాలు, అనే రెండు
వర్గాలున్నాయి. మాత్రా చందస్సును – వృత్త చందస్సుగా ప్రిగణించే క్రమంలోనే
జాతులుగ పేర్కొనటం జరిగిందని పరిశీలకుల అభిప్రాయం ” అని అంటారు డా.కోవెల
సంపత్కుమారాచార్య.

” గేయం ” అంటే మాత్రా చందస్సని తాత్పర్యం. అవి పద్యంగా, వృత్తంగా రూపొందే
క్రమంలో్ సన్నిహితపూర్వ దశ ”జాతులు ” ఈ సహచర్యం వలననే తెలుగు పద్యాలలో
ద్విపద, సీస, గీత జాతులతో గేయం తాలూకు వెసులుబాటు వృత్తంలా పదాల బిగింపు
రెండు మనం చూడవచ్చును. జాతులు మాత్రా చందస్సులే కాని, జాతుల మధ్య పద్య
సాన్నిహిత్య కారణంగా, ఒకటి మాత్రాగణ పద్ధతి, రెండది సంఖ్యా గణ పద్ధతి అని స్థూలంగా
రెండు విభాగాలుగా చెప్పుకోవచ్చును. వీటిలో రగడాదులు చేరుతాయి. మరొక ముఖ్యమైనదే
మంటే ” చందస్సు కవిత్వానిఉకి తప్పనిసరి నియమం కాక పోయినా, కవితా సౌందర్యాన్ని
మరింత ఇనుమడింపచేయటానికి పనికివస్తుందని, కవిత్వానికి చందస్సు కావాలా? వద్దా?
అని పదేపదే పున:రాలోచించాలని ” డా. చిన్న కేశవ రెడ్డి అభిప్రాయపడ్డారు.

గురజాడ మాటల్లో : ‘ చందస్సుకోసం, యతి ప్రాసల కోసం నిరర్థక పదాలను ఫర్లాంగు రాళ్ళవలె నిలిపెయ్యాలి. ‘ కౌపీన సంరక్షణార్థమయం పటాటోప: ‘ అన్నది కీలకాంశం. ఒక్క నిరర్థక పదం లేకుందా అన్ని, యిన్ని కాదు యెన్నో పద్యాలను చూడవచ్చు.చందస్సు, యతి ప్రాసల కోసం యిబ్బంది పడటమనేది పద్యానికే కాదు, గేయానికి వర్తిస్తుంది. అందుకే వ్యవహార భాషా పదాలనుసులువుగా, యథేచ్చగా యిముడ్చుకునే చందస్సులను మనం సృష్టీంచుకోవాలి ”

కేవలం గతిననుసరించి,లయ బద్ధంగా పాడుకోటమే గేయ లక్షణం. దానికి రాగ, తాళాదులు
జోడించి పాడుకుంటే పాటవుతుంది. ” గేయం – పాట ” ఒక రచనను – రచనగా వస్తు పర దృష్టితో గేయమా? పాటా? అనాలా అని స్పష్టీకరించడం కష్టమే. జాగ్రతగా గమనిస్తే రాగం
తీయటానికి అనుకూలంగా కొన్ని జాగాలు వదిలి, అది పాటగానో, గేయంగానో పేర్కొనవచ్చు.
దాని తయారీ విధానంతోనే అది గేయమో/పాటో తేలిపోతుంది.

గేయం వేరు, పాట వేరు అని, సంస్కృతంలో గేయమని, తెలుగులో పాటయని అంటున్నారు.
అయినా స్పష్టత రావలిసివుంది. రెండు రకాల్ భేదాలను గుర్తింఛటానికి రెండు వేరువేరు పదాలు ఆ భాషలో వున్నట్లు కనపడదు. అంటే సంస్కృతంలో పాటను యేమంటారు? తెలుగులో గేయాన్ని యేమంటారు – అని గుర్తింపులేదు.

అయితే కవులు గేయాన్ని యెందుకు యెక్కువగా స్వకరించలేదో, అందుకు కారణాలు యేమిటో పరిశోధించాల్సివుంది. అనుభూతి వాద కవులు గేయాన్నే కాక, పద్యాన్ని కూడ వదిలి ( రెంటినీ వదిలేస) కేవలం వచన గేయాన్ని (వచన కవిత – ప్రోజ్ పొయిట్రీ/ ఫ్రీవెర్స్ ) యెందుకూ రాస్తున్నారో విశ్లేషణ చేయవలసివుంది. కని మనం బాగా గమనిస్తే గద్దర్, వంగపండు ప్రసాద్ లాంటివారు ప్రధానంగా పాటను ప్రాధ్యానతాక్రమంలో వుంచతానికి కారణం బహుశ: అది జనానికి అందుబాటులోవుంటుందని, దగ్గరగా తీసుకువెళ్ళే ప్రయత్నంలో సఫలీకృతులయ్యారు. వారు ప్రజా గాయకులుగా ప్రసిద్ధిపొందింది అలాగేకదా! రేపు ఆధునిక సమాజం ఎంత మారినా గేయం మ్రోగుతూనేవుంటుంది. మానవ జీవితంలో ‘ లయ ‘ మిగిలివున్నంతవరకు, ఆ ‘ లయ ‘ ను నిలబెట్టే ప్రయత్నమే కవిత్వం, సాహిత్యాల ప్రముఖ లక్ష్యం ‘ అని డా.కోవెల సంపత్కుమారాచార్య అంటారు……..

(మిగతా తరువాత)
25.6.2013

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s