జాతి గీతం

కపిల రాం కుమార్// జాతి గీతం//

జాతులన్నిట తెలుగు జాతి – దేశ భాషల తెలుగు తీపి
తెలుగు మాట తెలుగు పాట – తెలుగువాడా తెలుసుకోరా!

నన్నయార్యుని ఆదికవనం- నన్నె చోడుని జాను తెనుగు
సోమనాథుని వీరశైవం – తిక్కనార్యుని తేట తెలుగు

పోతనార్యుని తీపి పలుకు సార్వభౌముని దాక్షపాకం
కృష్ణరాయుని కొలువులోన కీర్తిగాంచిన కావ్య ప్రగతి

తెలుగుయెదలు జల్లుమనగ – ఎల్లదిశలు అల్లుకొనగ
ప్రబంధాల మలుపులోన స్పూర్తినొందె సరస జగతి!

దాక్షిణాత్యుల ప్రేమ తత్వం ముద్దుపళని ముద్దుపలుకు
రంగవల్లుల యక్షగానం జాలువారిన జాణ తెలుగు

అన్నమయ్య కీర్తనల్లో ఉరకలెత్తిన శ్రావ్య జగతి
త్యాగరాజుని భక్తి గీతం యెదలు పొంగిన పారవశ్యం!

వీరేశలింగం వివేకవర్థిని వెలుగుజూపిం బతుకు దీఫం
కర్మసాక్షిగా చురకలేసిన పానుగంటి వెలుగుబాట!

అప్పరాయని పిల్లపూర్ణిమ – సుబ్బరాయుని యెంకి ఊసు
విశ్వనాథుని కన్నెపాట పల్లె పడుచుల ఒంపుసొంపు

కృష్ణపక్షపు తెలుగు జిలుగు బడుగు జీవుల శ్రినివాసు
కష్టకాలపు రా.వి.కథలు కావ్యవైద్యుడారోరుద్రుడు!

తురగకవనపు దళిత సాహితి – సూతకథల త్రిపురనేని
ఎగురవేసిన తెలుగు తేజం మరువలేనివి తెలుసుకో!

పాలమీద తరకలాగ కరుణ పద్యాల బుద్ధగీతం
కావ్య ఋషుల తపోఫలాల అందుకోను కదలిరవోయ్!

18.9.2012

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s