మధు -విద్యాలయం ( వైరా)

కపిల రాం కుమార్// మధు -విద్యాలయం ( వైరా)//

మధురమైన బడిలోన – విబుధులున్నచోటు
చవులూరె తేనెపట్టు – చదువులకే ఆటపట్టు!
సకల కళల రసపట్టు – అనుదినము వెన్నుదట్టు
గురుకులాల పద్ధతిలో ఫలితాలకు పెద్దపెట్టు!

గురువులను గౌరవించు – తరువులను పోషించు
సంప్రదాయ సాంకేతిక సంసర్గలు సంగమించు!
చిరుమువ్వల సవ్వడిలో మనసుదోచి వీణమీటు
ప్రజాకళల ఉన్నతికి ప్రయోగాలున్నచోటు!

ఉద్యమాల స్పూర్తి తోన కాబోయే పౌరులకు
శిరోధార్య విధానాల కరదీపికలున్నచోటు!
ఉత్సవాల అతిథులకు ఉత్సాహపు వేడుకలు
కలకాలము నిలచిపోవు మరపురాని అనుభూతులు.!

13.9.2012
______________________________________
(** ఖమ్మం జిల్లా వైరా లోని ”మధు విద్యాలయం ” – పాఠశాల స్థాయి నుండి జూనియర్ కళాస్థాయికి ఎదిగింది – వారు గతంలో నిర్వహించిన ఒక వార్షికోత్సవంలో చదివిన కవిత)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s