కవి గారి కాన్వాస్

కపిల రాంకుమార్||కవి గారి కాన్వాస్ ||

పేదరికపు పైట చిరిగి భారతమ్మ నిలబడితే
మదపుకళ్ళ వెధవలు లొట్టలేయచూస్తారు!

తల్లి, చెల్లి, వావి వరుస కానలేని కామాంధులు
మానవతా మనుగడను కాల్రాయచూస్తారు !

వెర్రి తలల ఉద్రేకం పుర్రెదొలిచే దాష్టీకం
పువ్వుల్లో గుంపాలు దిగవేసే ప్రావీణ్యం!
ఊదేస్తే యెగిరిపోవు పేలపిండి మాదిరిగ
కీచకు్ని సోదరులై ఆచరింపచూస్తారు!

” గౌతము ‘ ని బోధనలు అధ్యయనం చేయరు
భద్రంగా జనాలను నిద్రకూడపోనివ్వరు!
కొంతమంది కుర్రవాళ్ళు నాజీలకు వారసులు
మధ్యయుగపుటలవాత్లను మానలేని వానరులు!

ముందుచూపున్నవాడు రెండు శ్రీల కళ్ళజోడు
కుర్రవాళ్ళ చేష్టలపై ”లిరిక్కులు “చెప్పినాడు
ఊపేసే బొమ్మలతో యువతరం నిర్వీర్యం
నిత్యకృత్య యాగీలతో అంతులేని కార్పణ్యం!

ముదనష్టపు బుద్ధులు మారాలని
మదమెక్కి భవితను తుంచుకోకండని
పశువుల కన్నా హీనంగా మారకండని
హెచ్చరిక! విన్నారా సరే! లేదా ..చెప్పం!
చేసే చూపిస్తాం – పదుగురికి తెలిసేలా
నలుగురిలో నిలేస్తామో- చీరేస్తామో! చీర లిస్తామో…

25.12.2012
10.14
ఇంత ఉవ్వెత్తున నిరసన వ్యక్తమౌతున్నా నిన్న, మొన్న అఘాయిత్యాలు జరుగుతూనే వున్నందుకు నిరసనగా.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s