శకునపక్షి నాటికలో సామెతలు – నార్ల వెంకటేశ్వరరావు

కపిల రాంకుమార్| శకునపక్షి నాటికలో సామెతలు – నార్ల వెంకటేశ్వరరావు ||
నార్ల వెంకటేశ్వర రావు రాసిన శకున పక్షి నాటిక ఒక రైతు కుటుంబ నేపథ్యమ్ళొ రాసినదైనా సంభాషణలలో తెలుగు సామెతలు మెందుగా ప్రతీ పాత్ర ద్వారా పలికించిహాస్యం పండింది.పొద్దున్నే వచ్చావేమిటన్న రామయయ్యతో సీతాపతి ” పొద్దున్నే వచ్చిన వాన, పొద్దుపోయి వచ్చిన చుట్టం పోయేదిలేదని ” దిగులుగావుందా అంటాడు. అయినా నువ్వు వూరికినే రాలేదని అన్నప్పుడు నీ కొకరి అంటూ సొంటూ గిట్టదు కదా అంటూ సీతాపతి ” నన్ను ముట్టుకోకు నామాల కాకి ” అంటావు అనే సామెత వాడతాడు. యేం పనిమీదొచ్చావో చెప్పవయ్యా అన్నపుడు ” చల్ల కొచ్చి ముంత దాస్తున్నాననేగా” నీచోద్యం! వూరికినే రావులేవయ్యా వచ్చిందెందుకో చెప్పు అన్నపుడూ మళ్ళి సామెత వేస్తాడు సీతాపతి రామయ్యతో ” లాభంలేని సెట్టి వరదను పోడంటావ్ ” బాగా మాటలు నేర్చావనగానే ” వలచి వస్తే మేనమామ కూతురు వరస కాదనే రకం ‘ నీది అని సమాధానమిస్తాడు . మనసులో మాట బయట పెడ్తున్నట్లనిపించేలా ‘ రోహిణీ కార్తెలో రోళ్ళు బద్దలుతా’యని వురకే అన్నారా. తాగటాని చల్లబొట్టు కూడ లేదేమో అని రామయ్య భార్యతో అంటాడు. అయ్యో పాడిలేదేమీ అన్నయ్యా అనగానే ” పాడిలేని యిల్లు పాతాళలోకం కదూ”ఎక్కడైనం వాదికపీటుకో వచ్చుగా అనగానే యేమోనమ్మా ” అమ్మాబోతే ఆదివి కొనబోతే కొరివి ” లాతెచ్చుకున్న అణాపెరుగుతో కాలం గడువదుకదా. అయినా మీ పాలెం పడ్డ యీనిందనుకుంటాను, మర్మగర్భంగా ఆరా తీయాలని ఆంటాడు. అందుకు ”యీని యేం లాభంలే అన్నయ్యా నిన్న పక్కింటావిడ దిష్టితగిలనట్టుంది ఒక్క చుక్కైఅనా విడివలేదు . వెంటనే అందుకుంటాదు ‘ నరుడి కంట నల్లరాయైనా పగుల్తింది ‘ అని పాటిమీద సాయెబును పిలిచి తావెత్తు కట్టించు సలహా యిస్తాడు.
పిలిపిద్దామని పాలేరుని వెళ్ళమంటే కుదర్దు అని మొరాయించాడు. అంది ఇలాలు. అలాగటమ్మా
‘ తిండికి తిమ్మ రాజు పనికి పోతురాజు ” పిదప కాలంలో పాలేరుమాట వినటంలేదు.’ పత్తి గింజలు
తింటావా బసవన్నా అంటే ఆహా అన్నాడట, మరి గంత కట్టనా అంటే ఊహూ అన్నాడాట ‘
అలావుమొదన్నమాట వాళ్ళపని. సాయెబుని నే వెళ్ళిపిలుచుకొస్తాగాని ఆ చల్లనీళ్ళు నువ్వే పోద్దువుగాని
చెల్లమ్మా! అంటాడు. అదా ఆపనిమీద వచ్చావన్నమాట అని రామయ్య అనగానే ఆ ‘ అయినోళ్ళకు
ఆకుల్లో, కానోళ్ళకు కంచాల్లోను ‘ అని ఆర్.ఐ.కి సమర్పించుకున్నావు కాని నాకు కుండనీళ్ళడిగితే
ఎలా చదువుతున్నాడో బావ చూడమ్మా అని దెప్పుతాడు. అందుకు రామయ్య ” కాలికేస్తే
మెడకి, మెడకేస్తే కాలి ‘ వేస్తావు మాటలు నేర్చావుకదా, చల్లకొచ్చాననే విషయం ముందే చెప్పొచ్చుగా
అంటాదు.ఆ వెనుకటికెవడో” కడుపులో లేందిం కావిలించుకుంటే వొస్తుందా ‘ అని సమాధానం
వెంటనే అందుకుంటాడు సితాపతి. ఇంకో సందర్భంలో పిల్లవాడు ఇంటికిరాలేదని ఇంటావిడ అనగానే
అందుకుని సీతాపతి ” సముద్రం యీదవచ్చు కాని సంసారం ఈదరాదు. ‘ ఈ కాలం పిల్లలకి యేం
తెలుస్తాయి, సంసారమ్ళొణి సాధక బాధకాలు వూరిమీద పడి తిరగటమేకదా. ఇంకో సందర్భంలో
సీతాపతీ నువ్వే నయం ఐదురూఅడపిల్లలకి పేళ్ళిళ్ళుచేసావు పైసా అప్పులేకుండా, అని రామయ్య
అనగానే ఇక నామాటే చెప్పుకోవాలీ ‘ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు తులాభారం తూగితే, కరెడ్ల
కామమ్మ వంకా్యల భారం తూగిందట ‘ నీకంటే నాలుగెకరాలుపంచుకున్నానే కాని నాపని
” నానాటికి తీసికట్టు నాగంభట్లు ‘ అన్నట్టుగావుంది, చ్వరికి పుగాకు తుంపుకు కూడా ఠికాణా లేదు.
వెనకటికి నాబోటివాడెవదొ ‘ దశాదశా రమ్మంటే, దరిద్రాన్ని పిలవమన్నదట!.” దశంటే నీది
పుగాకుకాడొకటి పారెయ్ బావ!, అని మరొక కోరిక వెళ్ళబుచ్చుతాడు సీతాపతి…….
______________________________________________
….నాటిక ఆసాంతం కథా సంవిధానం తో పాటు, సంభాషణలు గ్రామీణ నేపథ్యంతో సాగుతుంది.
నార్లవారి రచనలు వాల్యూం 2 – సంపాదకుడు :వెలగా వెంకటప్పయ్య- ప్రచురణ- నార్ల కుటుంబం
2004 వెల.200-/- అన్ని పుస్తక విక్రయకేంద్రాలలో
___________________________________________
27-9-2013 – సా. 5.30

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s