||సాహితీ సుమాలు – నలిమెల భాస్కర్ ||

కపిల రాంకుమార్||సాహితీ సుమాలు – నలిమెల భాస్కర్ ||
నలిమెల బాస్కర్ ‘ సాహితీ సుమాలు ‘ అనే పుస్తకానికి ‘ నిఖిలేశ్వర్ ‘ ముందుమాట రాస్తూ ‘ సుమ’ సౌరభాలతో సాహిత్య ద్వారాలు తెరిచిన భాస్కరుడన్నారు. 17 వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కవి మీర్ నుంది 20 వ శతాబ్దానికి చెందిన కొండ జాతి అక్షరమల్లె ‘ ఛునీ ‘ దాకా 35 మంది సాహితీవేత్తలతో కరచాలనం చేయిస్తాడు. ఈ వ్యాసాలన్నీ గతంలో ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలొ 35 వారాలపాటుసాహితీ సుమాల పరిమళం వెదజల్లాయి. అవి ఒక పుస్తకరూపంలో నయనం ప్రచురణలు, సిరిసిల్ల వారు వెలుగులోకి తెచ్చారు, డిసెంబరు 2000 లో. ” సాత్ వలేకర్ మొదలు మనవాడైన ఎలుగు పెద్ద సామల సద్దశివ గురించి ఈ తరం చదివితే అపారమైన వదుష్యం, కళాత్మక హృదయం, ఆ వ్యక్తిత్వాల్లో ఎంతగా రక్తరంజితమైపోయాయో అర్త్హం చేసుకోగలం. ” అంటారు నిఖిలేశ్వర్.
”ఈ పరిచయ వ్యాసాలుచదువుతూంటే ఓకచోటా అకస్మాత్తుగా ఆగి ఆలోచిస్తాం.’ విధి’ వక్రీకరించినా ఓడిపోని అజేయ సంకల్పంతో జీవితాన్ని సార్థకం చేసుకున్న మన కరీంనగర్ (ఊటూరు గ్రామం)(కీ.శే)ముద్దసాని రామిరెడ్డి గారు పలుకరిస్తారు.గత 33 (2000 నాటికి) సంవత్సరాలుగా మంచంమీద బోర్లా పడుకుని తనకు తొచినరీతిలో సాహిత్య సేవ చ్స్తూవున్నారాయన. 1967 లో జరిగిన రోడు ప్రమాదంలో వెన్నెముక విరిగి
శయ్యాగతుడుగా శేష జీవితాన్ని అక్షరాయాగం చేస్తూ ఆరాధన కావించాడు. ఇక మన పొరుగున వున్న తమిళ కథాశిల్పి ‘ పుదుమై పిత్తన్‌ ‘ కన్నడ అభ్యుదయ రచయితా అశ్వత్థ, మలయాళీ రెబల్ రచయిత ‘ కోవిలమ్‌’ మనలో ఎంతమందికి తెలుసు? చాల మందికి అసలు తెలియదు అని అంగీకరించే పరిస్థితి యీనాటికి నెలకొనివుంది. భాషాపరమైన యిబ్బందులున్నా, కనీసం ఇంగ్లీషు లేదా హిందీ అనువాదాల ద్వారానైనా మన భారతీయ
రచయితలను మనం ఏమాత్రం చదువుతున్నామనే ఆత్మ పరిశిలన చేసుకోవాలి” అంటారు నిఖిలేశ్వర్.
” 1950-70 మధ్య ఆనాటి తరానికి శరత్, ప్రేమ్‌చంద్, రాహుల్ శాంకృత్యాయం తదితరులు అనువాదాల ద్వారా మనకెంతో దగ్గరైనారు. మరి ఈ రోర్జు ప్రోత్సహిస్తున్నామా?..ఆ కర్తవ్యాన్ని తిరిగి నలిమెల భాస్కర్ ఈ సాహితీ సుమాల ద్వారా గుర్తుచేస్తూ, తన ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా అనువాద యాగం కావిస్తున్న సోమయాజి. అందుకు ఆయనని మనసారామెచ్చుకుంటున్నాను ..అంటు ముగించారు నిఖిలేశ్వర్ డిసెంబర్ 6-2000 న.
___________________________________________
1.10.2013 ఉదయం 6.50

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s