సౌజన్యం కొరవడినప్పుడు

కపిల రాం కుమార్ // సౌజన్యం కొరవడినప్పుడు//

నినాదాలు విధి విధానాలు కాకుంటే్ – చేసిన శాసనాలు ప్రహసనాలతై
నమ్మకంగా సేవ చేసే వారు -అపనమ్మకానికి గురైతే – తిరుగుబాటు చేస్తారు!

అంకురాలు మొల్కెత్తే పిడికళ్ళౌతాయి
గళాలు సవరించి యువత శిరమెత్తే కొడవళ్ళౌతాయి!

ఊకదంపుడు ఉపన్యాసాలు తాలు గింజలైతే-
కారం దంచిన రోకళ్ళే రాకెట్ లాంచర్లవుతాయి.

కౌంటరు వాదాలకు ఎనకౌంటర్లు సమాధానాలా?
రాజ్య హింస లక్షణం అదే కదా!

పాఠశాలలు, వైద్య శాలలు,ఏమైనా ఒకటే!
కామాంధుల్కు పానశాలలవటానికి- కామ మందిరాలవటానికి!

ఉన్మాదం ” ఎయిడ్స్” కంటే ప్రమాదం
శృతి మించిన వ్యామోహం వావి వరుసల్ని మార్చేస్తుంది!

”పోటీ పడి కాటులాడ” – ఉదాహరణలిచ్చిన” కాళోజీ” భవిష్యద్దర్శ కుడే!
”ఏమున్నది గర్వ కారణం” కవిత్వీకరించిన ”శ్రీశ్రీ ”భవిష్య వాణి వినిపించదా!
ఆందుకే మళ్ళీ మళ్ళీ ఆ కవితల్ని ఆపోసన పట్టండి!
జనం నాడిని, వాడిని, వేడిని పట్టడానికి!

ఎన్నికలలోనూ పెళ్ళి సన్నాహాలలోనూ ధనం మూలం ఇదం జగత్ చేసే నృత్యం
విలువల్ని మానవ వలువల్ని నిత్యం హరంచేవే! నగ్న సత్యం ఇది కాదా!

సజ్జ చేలూ, జొన్న చేలే కాదు – వరిచేలు సైతం
పూల సజ్జలౌతూంటే (SEZ లవుతుంటే)
కడలి అలజడికంటే ఘోరంగా మత్స్యకారుల జీవితాల్తో
లాఠీల చేష్టలు ఆరంగ్రేట్రం చేస్తున్నంత ఆనంద్పడుతుంటే
గంగవరం, పోలవరం, విశాఖ మన్యం, ఎక్కడైనా
గిరిజన సంస్కృతికి చితిపేర్చేవే!

హైటెక్కు నగరం పేరుకే కని పసిపిల్లల్ని వికలాంగులుగా చేసి
ముష్టిని వృత్తిగా రుద్ది లాభపడే లాబీయింగ్ మాఫొయాల
అడ్డాబాద్ (హైదరాబాద్) అవుతుంటే
మా తాతలు నేతులు తాగారు – మా మూతులు వాసన చూడండమ్మ
సర్కారీ ప్రకటనలు నవ్విస్తున్నాయి! – కాదు కొత్త ఉప్పెనకు
శంకుస్థాపనలౌతున్నాయి!

కపట ప్రేమలు వడ్డించినా
కంబళిలో భోజనం వెంట్రుకలే కాదు పాలకుల పెంటికలు
కూడ వస్తాయి..థూ! అనరాదు..అన్న వారు ఉగ్ర వాది!
వాడికి దండ పడినట్లే!
అసమానతలు ఆవరిస్తున్నా మబ్బుమాటు సూర్యుడంటూ
కల్లబొల్లి కబుర్లు, బతుకులు మబ్బు పట్టిన వైనం కానలేని కళ్ళకు
వాస్తవాలు రుచించవు!

కబోదికాపురం కుండల్కు చేటన్నట్లు,
”ఆం ఆద్మీ”” తనకుతానే ”దుష్మనీ”” ఔతున్నాడా?
లేక ”నఘర్ కా-న ఘాట్ కా”‘ తరీకాలో
సర్కారీ మోసాలకే బలౌతున్నాడా? తెలుసుకోడి!

సౌజన్యం కొరవడినప్పుడు కవుల్ కలాలకు
పదునుపెట్టే సమయిదే!
వాలిపోయే స్ట్రీట్ వదిలి చివురించే ఎర్రదేశాలకు మద్దతివ్వండి!
కొత్త కలాల్లో సమసమాజ ప్ద్యాలు దొర్లాలని కోరుకుంటాను!
” పరిత్రాణాయ సాధూనాం ….సంభవామి యుగేయుగే ” లా
ఉద్యమాలకు ఉనికిపట్టు కావాల్సిన సమయం ఇదే ఇదే!!!

5-9-2012

**(ఉగాది కవి సమ్మేళనం – ఖమ్మం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s